సింగరేణి కార్మికులకు తీపి కబురు: దసరా బోనస్గా రూ.1.51 లక్షలు

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

సింగరేణి ఉద్యోగులకు రూ.1.51 లక్షల చొప్పున దసరా బోనస్ అందిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. సంస్థ సాధించిన లాభాల్లో 34 శాతాన్ని పర్మినెంట్ కార్మికులకు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదు వేల ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే సింగరేణి లాభాలు తగ్గాయని ఆయన విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.