పంజాబ్లో డ్రగ్స్ భూతంపై బీజేపీ నషా ముక్త్ యాత్ర
రిపోర్టర్: హరి
స్థలం: Fazilka, Punjab
పంజాబ్లో పెరుగుతున్న డ్రగ్స్ వ్యసనానికి వ్యతిరేకంగా బీజేపీ నషా ముక్త్ యాత్ర నిర్వహిస్తోందని ఆ పార్టీ నేత సునీల్ జాఖర్ తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ బెడదను అణచివేయడానికి బీజేపీ గట్టి సంకల్పంతో ఉందని స్పష్టం చేశారు. ఈ యాత్ర ద్వారా మాదకద్రవ్యాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను నేరుగా కలిసి వారికి అండగా నిలుస్తున్నట్లు ఆయన ఫాజిల్కాలో పేర్కొన్నారు.