తిరుమల బ్రహ్మోత్సవాలలో అశ్వవాహన సేవ మరియు భరతనాట్య ప్రదర్శన

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి అశ్వవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉభయదేవేరులతో కలిసి శ్రీ మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కళాకారుల బృందం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.