అమెరికాలో వైఎస్సార్సీపీ నేతకు జైలు శిక్ష: యువకుడిని తీసుకెళ్లి తీవ్ర హింస
రిపోర్టర్: శివ
స్థలం: పల్నాడు
అమెరికాలో యువకుడిని హింసించిన కేసులో వైఎస్సార్సీపీ నేత సత్తారు వెంకటేశ్రెడ్డికి అక్కడి కోర్టు యాభై నెలల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాకు చెందిన వెంకటేశ్రెడ్డి ఉపాధి పేరుతో అమెరికాకు తీసుకెళ్లి ఇంటి పనులు చేయించుకుంటూ దాడులకు పాల్పడ్డాడు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మరో ఇద్దరికి కూడా జైలు శిక్ష ఖరారైందని వెల్లడించారు. నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.