భరతవర్ష సినిమా నుంచి అమ్మ కదిలి వచ్చె పాట విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక యాక్షన్ చిత్రం భరతవర్ష. నవరాత్రుల సందర్భంగా ఈ సినిమా నుంచి అమ్మ కదిలి వచ్చె పేరుతో రెండో పాటను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. దుర్గాదేవి ఆరాధన వైభవాన్ని చాటే ఈ ఆధ్యాత్మిక గీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.