అక్షయ్, సైఫ్ నటిస్తున్న 'హైవాన్' చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్

రిపోర్టర్: మహేష్ స్థలం: India

ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హైవాన్'. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ 16+ సర్టిఫికేట్ జారీ చేసింది. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బామన్ ఇరానీ, సాయిమి ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.