మొహమ్మద్ రిజ్వాన్ ఫోన్ సీజ్ వ్యవహారంలో ఐసీసీ ఏసీయూను ఆశ్రయించిన పాకిస్థాన్ క్రికెటర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Lahore
పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ తన మొబైల్ ఫోన్ సీజ్ చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన ఫోన్ స్వాధీనం చేసుకోవడంపై స్పష్టత కోరుతూ ఆయన ఐసీసీ ఏసీయూ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ అభ్యర్థన సమర్పించారు. లాహోర్ హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసిన తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.