నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లతో పాటు అమరావతి అభివృద్ధికి ఏపీ కేబినెట్ ఆమోదం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేసేందుకు రూ.1,548.98 కోట్ల వ్యయానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.