పర్యావరణ హితం కోసం మట్టి వినాయక పూజల పిలుపు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాబోయే వినాయక పండుగ సందర్భంగా ప్రజలంతా మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి హాని కలిగించే రంగుల విగ్రహాలను వాడకూడదని, ప్రకృతిని పరిరక్షించే దిశగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలతోనే పూజలు నిర్వహించి బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ప్రత్యేకంగా కోరారు.