కర్ణాటకలో తులు భాషకు అధికారిక హోదా కల్పించడంపై నటుడు సునీల్ శెట్టి హర్షం
రిపోర్టర్: సురేష్
స్థలం: కర్ణాటక
కర్ణాటకలో తులు భాషకు అధికారిక హోదా లభించడం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. మంగళూరులో జరిగిన ప్రత్యేక సమావేశంలో కర్ణాటక మంత్రివర్గం తులు భాషకు దక్షిణ ఉడుపి జిల్లాలలో అధికారిక హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన సునీల్ శెట్టి, ఇది కేవలం భాష మాత్రమే కాదని, తన మూలాలు, జ్ఞాపకాలు, కుటుంబంతో ముడిపడిన అమూల్యమైన బంధమని పేర్కొంటూ తుళువులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.