మహిళా నేతల అరెస్టులపై మధిరలో నిరసన ర్యాలీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మధిర
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపై పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ మధిరలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఈ నిరసన కొనసాగింది.
ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న మహిళా నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.