కాంగ్రెస్ హామీలపై కమల్ రాజు నిప్పులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మధిర
మధిరలో జరిగిన నిరసనలో కమల్ రాజు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దళిత బంధు కింద రూ.12 లక్షలు, మహిళలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కమల్ రాజు డిమాండ్ చేశారు.