టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్: నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న స్టార్క్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Sydney

ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన మూడు టెస్టుల సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆయన, అత్యధికంగా పదిహేను వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్ ను వెనక్ కి నెట్టి స్టార్క్ నంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.