మహారాష్ట్రలో డిసెంబర్ లో ఎంహెచ్ సీఈటీ ఫేజ్ వన్ పరీక్ష

రిపోర్టర్: హరి స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్ర స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెల్ ఎంహెచ్ సీఈటీ 2027 ఫేజ్ వన్ పరీక్షను డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పరీక్ష తేదీలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తుండగా, అధికారిక వెబ్ సైట్ ద్వారా షెడ్యూల్ వెల్లడించనున్నారు. అలాగే ఇంటర్ మార్కులను మెరిట్ జాబితాలో పరిగణించడంపై కూడా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.