రూ.863 కోట్లతో చిలకపాలెం-రాయగడ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం
రిపోర్టర్: అశోక్
స్థలం: పార్వతీపురం మన్యం
ఉమ్మడి పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రధాన రహదారి అయిన చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ మార్గాన్ని పీపీపీ విధానంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇంజినీరింగు వర్గాలు వెల్లడించాయి. సుమారు 131 కిలోమీటర్ల పొడవున రూ.863 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. రామభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాల మీదుగా సాగే ఈ రహదారి విస్తరణతో ప్రయాణికుల కష్టాలు తొలగిపోనున్నాయని, త్వరితగతిన పనులు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.