వైఎస్ఆర్ నగర్ రోడ్ల నిర్మాణ అనుమతులపై హర్షం
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ నగర్ రోడ్ల నిర్మాణానికి గత ఇరవై సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అనుమతులు లభించడంతో స్థానిక కాలనీవాసులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని పూసపాటి అదితి విజయనగరం వెల్లడించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి నాయకులను కలిసి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. దశాబ్దాల సమస్యకు మోక్షం లభించడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగిందని పూసపాటి అదితి విజయనగరం తెలిపారు.