ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1 పింఛన్ల పంపిణీ సమయాల్లో మార్పు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ సమయాల్లో మార్పు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ఉదయం కాకుండా మధ్యాహ్నం నుంచి పింఛన్లు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 61.80 లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.2,692 కోట్లు విడుదల చేశామన్నారు. సచివాలయ ఉద్యోగులు ఉదయం బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి, మధ్యాహ్నం నుంచి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తారని స్పష్టం చేశారు.