మంగినపూడి సాగరతీరంలో వైభవంగా సాగరతీర విజయగణపతి జల నిమజ్జనం
రిపోర్టర్: సునీల్
స్థలం: మచిలీపట్నం
కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడిలో పన్నెండు రోజులుగా పూజలందుకున్న అరవై మూడు అడుగుల ఎత్తు గల సాగరతీర విజయగణపతి విగ్రహాన్ని శుక్రవారం అధికారికంగా జల నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మట్టితో తయారైన ఈ భారీ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర ముందుగా జల్లుస్నానం చేయించారు. రెండు ఫైరింజన్లతో సుమారు రెండు గంటల సేపు నీటిని పంప్ చేస్తూ ఈ నిమజ్జన ప్రక్రియను పూర్తి చేశారు.