తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ ఆదేశం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. జూబ్లీ హిల్స్ నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు భూములకు పరిహారం చెల్లించడానికి మరియు జాయింట్ అకౌంట్ లో నిధులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.