బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టును తీవ్రంగా ఖండించిన కేటీఆర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల అక్రమ అరెస్టులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు. హామీల అమలు చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. తామంతా స్వచ్ఛందంగా అరెస్టు కావడానికి సిద్ధమని, హామీలు అమలు చేస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ సవాల్ చేశారు.