అధిక ధరలకు బియ్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
బియ్యం విక్రయదారులు తమ కేంద్రాలలో వివిధ రకాల బియ్యం ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ అన్నారు. మంచిర్యాలలో దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బిపిటి కిలో అరవై ఆరు, తెలంగాణ సోనా డెబ్బై నాలుగు, జైశ్రీరామ్ డెబ్బై తొమ్మిది రూపాయలకు మించరాదని ఆయన స్పష్టం చేశారు.