టాలీవుడ్ సినిమా ప్రియదర్శి ఇడుపు కాయితం డిసెంబర్ 11న విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ఇడుపు కాయితం సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగదుర్గ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ కుటుంబ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కుటుంబ బంధాలు, భావోద్వేగాల చుట్టూ సాగుతుందని సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.