గణేశ్ ఉత్సవాల నిర్వహణ కోసం ఆర్థిక సహాయం అందజేత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ముత్తారం
ముత్తారం మండల కేంద్రంలోని కుమ్మరిపల్లె యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన గణేశ్ మండపానికి మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు రూ.10,000, ముత్తారం మాజీ సర్పంచ్ తాటిపాముల వకుళారాణి-శంకర్ దంపతులు రూ.10,000 చొప్పున మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. గణేశ్ మండపం వద్దకు డీజే బాక్స్ ల కోసం ఈ నగదును అందజేయగా, ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న వారికి యూత్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.