జీకే వీధి జడ్పీటీసీ అభ్యర్థిగా పాంగి కృష్ణరావును ఎంపిక చేసిన జనసేన
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్థిగా పాంగి కృష్ణరావును జనసేన పార్టీ ఎంపిక చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున ఆయన బరిలో నిలవనున్నారు. ఈ నిర్ణయంతో స్థానిక కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొనగా మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు సమష్టిగా కృషి చేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి.