భారీ వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన, 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
రిపోర్టర్: అశోక్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలిక వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని 15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలోనే వంతెన ధ్వంసమైతే కేవలం తాత్కాలిక ఏర్పాట్లు చేశారని, వెంటనే శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని స్థానిక గిరిజనులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.