'వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి': నిజామాబాద్ రైతు ఆవేదన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో నైరుతి రుతుపవనాలు నిరాశపరచడంతో పాటు లోటు వర్షపాతం కారణంగా చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండక అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 33 మండలాల్లో సగానికి పైగా చోట్ల సాధారణ వర్షపాతమే నమోదు కాగా, భూగర్భ జలాలు పడిపోయి వరి పొలాలు ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని రైతులు వాపోతున్నారు. ఎగువన ప్రాజెక్టులు సగం ఖాళీగా ఉండటంతో ఖరీఫ్ పంట గట్టెక్కినా రెండో పంటకు సాగు నీరందేలా లేదని కర్షకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.