మీ భూమి – మీ హక్కు: లబ్ధిదారులకు పాసుపుస్తకాల పంపిణీ

రిపోర్టర్: సునీల్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం కనసానపల్లి మరియు వట్టిగుడిపాడు గ్రామాల్లో 'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి మరియు నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అందజేసినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.