మహిళలకు ఉపాధి: రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మిల్లెట్ కేఫ్‌లు ఏర్పాటు చేయనున్న సర్కార్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో తొలి విడతగా ఐదు ప్రత్యేక మిల్లెట్ కేఫ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వారు వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్ లో వీటిని ప్రారంభించనున్నారు. చిరుధాన్యాల వినివిధాన్ని ప్రోత్సహించడంతో పాటు మహిళలకు మెరుగైన ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అని అధికారులు పేర్కొన్నారు.