ప్రేమనే ఊరిలో చిత్రం నుంచి అమ్మ ప్రేమ పంచు పాట విడుదల
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ పాటను శుక్రవారం విడుదల చేశారు. రామ్ మిర్యాల ఆలపించిన ఈ తండ్రి ప్రేమ భావోద్వేగాల పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.