ఓటీటీలోకి ఎంఎస్ రాజు అఘాధ చిత్రం

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

దిగ్గజ దర్శకుడు ఎంఎస్ రాజు తెరకెక్కించిన మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం అఘాధ త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీఈవీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశి విశాలాక్షి బలుసు నిర్మించారు.