వృషకర్మ ఫస్ట్ సింగిల్: నవంబర్ ఏడున స్వాగ్ ఆఫ్ అర్జున్ విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ వృషకర్మ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక ప్రకటన చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ స్వాగ్ ఆఫ్ అర్జున్ ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ ఏడున విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. డిసెంబర్ నాలుగున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.