ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యమన్న అసదుద్దీన్ ఒవైసీ

రిపోర్టర్: అశోక్ స్థలం: Lucknow

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేలా బలోపేతం చేయడానికే వచ్చామని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లక్నోలో తెలిపారు. ప్రజల నిజమైన గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకే తాము ప్రయత్నిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సన్నాహకాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.