తీరానికి తీవ్ర తుపాను ముప్పు: ఒంగోలు సమీపంలో మురసు తుపాను దాటుతున్న వైనం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
తీవ్ర తుపాను మురసు మంగళవారం తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో తీరం దాటిందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈదురుగాలుల తీవ్రత కారణంగా ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు చర్యల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పరిస్థితిని సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు.