ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

తెలంగాణ ఉద్యమంలో వెన్నుముకగా నిలిచిన ఉద్యోగులు నేడు పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ వంటి సమస్యలపై తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నాడు ప్రాణాలైనా అర్పిస్తామని నడిపించిన పెద్దన్న కేసీఆర్, నేడు తమ తరఫున గళం ఎత్తాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. ప్రత్యర్థుల విమర్శలను లెక్కచేయకుండా, అసెంబ్లీ రికార్డుల్లో ప్రజల గొంతుక వినిపించడానికి కేసీఆర్ చట్టసభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.