మహారాష్ట్ర ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశాల మూడో జాబితా విడుదల
రిపోర్టర్: మహేష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలో ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశాల కోసం సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్ మూడో విడత సీట్ల కేటాయింపు జాబితాను స్టేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ సెల్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 165 లా కాలేజీల్లో అందుబాటులో ఉన్న 7,977 సీట్లకు గాను మూడో విడతలో 6,688 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 23వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో ధ్రువపత్రాలు సమర్పించి ఫీజు చెల్లించి ప్రవేశాలను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.