గుడివాడలో వినాయక చవితి వేడుకల్లో అట్టహాసంగా భారీ అన్నదానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాడేరు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుడివాడ గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ పెద్దలు, పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండు రాజు తదితరులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.