యెమెన్ మార్కెట్ పై వైమానిక దాడి: ఇరవై మంది మృతితో కలకలం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తైజ్
యెమెన్ లోని మార్కెట్ పై జరిగిన భీకర వైమానిక దాడిలో ఇరవై మంది మరణించారని హూతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి తెలిపారు. తైజ్ ప్రావిన్స్ లోని అల్-వజియా ప్రాంతంలో శుక్రవారం ఈ ఘోర ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ దాడుల్ లో మరో పదిహేను మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి సౌదీ అరేబియానే పూర్తి బాధ్యత వహించాలని హూతీ వర్గాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాయి.