డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రోమన్ రెయిన్స్ ఆరోగ్యంపై సంచలన ప్రకటన
రిపోర్టర్: మహేష్
స్థలం: Global
డబ్ల్యూడబ్ల్యూఈ ప్రముఖ రెజ్లర్ రోమన్ రెయిన్స్ తన ప్రాణాంతక ల్యుకేమియా వ్యాధిపై కీలక విషయాలు వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షించుకోవాలని, కోలుకునే ప్రక్రియలో చాలా జాగ్రత్తగా ఉండాలని మెన్స్ హెల్త్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో రోమన్ రెయిన్స్ స్పష్టం చేశారు. ఈ వ్యాధి ప్రస్తుతం అదుపులోనే ఉన్నప్పటికీ, పూర్తిగా నివారణ కాలేదని, వైద్యుల సలహా మేరకే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.