శ్రీనగర్ విమానాశ్రయంలో స్తంభాన్ని ఢీకొట్టిన ఇండిగో విమానం

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీనగర్

శ్రీనగర్ విమానాశ్రయంలో ఇండిగో విమానం పార్కింగ్ బే వద్ద సాంకేతిక స్తంభాన్ని ఢీకొట్టింది. ముంబయి నుంచి వచ్చిన ఈ విమానం పార్కింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, మరమ్మతుల కోసం విమానాన్ని నిలిపివేశారు. విమానాశ్రయంలో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.