మహిళా ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించిన పోలీసుల గుర్తింపునకు హైకోర్టు ఆదేశం
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ గేటు వద్ద విపక్ష బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులను తక్షణమే గుర్తించాలని రాష్ట్ర హైకోర్టు డీజీపీని ఆదేశించింది. నిరసన ప్రదర్శన సందర్భంగా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులతో అసభ్యంగా వ్యవహరించిన అధికారుల వివరాలను సేకరించి, సమగ్ర నివేదికను అసెంబ్లీ స్పీకర్‌కు అందజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాసనసభా పరిసరాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకునే సర్వాధికారాలు స్పీకర్‌కే ఉంటాయని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.