మెట్ట ప్రాంత రైతులకు వరంగా మారిన పట్టిసీమ జలాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆంధ్రప్రదేశ్
కృష్ణా డెల్టాతో పాటు మెట్ట ప్రాంత రైతులకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం వరంగా మారింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేని దుర్భిక్ష పరిస్థితుల్లోనూ గోదావరి జలాలు పంటలను ఆదుకుంటున్నాయి. పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా రోజూ 8,150 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండటంతో వరి సాగు సజావుగా సాగుతోందని, చీడపీడలు తగ్గి అధిక దిగుబడులు వస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.