తెదేపాలోకి వైకాపా నేతలు: బొత్స నియోజకవర్గంలో గులాబీ పార్టీకి భారీ షాక్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మెరకముడిదాం

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. మెరకముడిదాం మండలం చినభంటుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సమక్షంలో వివిధ గ్రామాల నుంచి రెండు వేల మంది వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే కళావెంకటరావు భరోసా కల్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.