నరసన్నపేటలో ప్రైవేట్ బస్సు దగ్ధం తృటిలో తప్పిన ప్రాణాపాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నరసన్నపేట
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్మూ జంక్షన్ వద్ద విజయవాడ నుంచి టెక్కలి వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు అందరూ అప్రమత్తమై సురక్షితంగా కిందకు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనాయం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.