మాజీ సైనికుడైన ఉపాధ్యాయుడిపై సాక్షి మీడియా ప్రతినిధుల దాడి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
కుప్పం మండలం నడిమూరు పాఠశాలలో మెగా డీఎస్సీ ద్వారా ఎక్స్-సర్వీస్మెన్ కోటాలో హెచ్ఎమ్గా పనిచేస్తున్న మాజీ సైనికుడు వి. చక్రపాణి రెడ్డిపై సాక్షి మీడియా ప్రతినిధులు తరగతి గదిలో దాడికి పాల్పడ్డారు. సర్టిఫికెట్లు చూపించకపోతే తప్పుడు వార్తలు రాస్తామంటూ విద్యార్థుల ముందే చొక్కా పట్టుకుని బెదిరించడంపై విద్యావేత్తలు, మాజీ సైనిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.