వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతుల కీలక నిర్ణయం దిశగా అడుగులు

రిపోర్టర్: విజయ్ స్థలం: వరంగల్

వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ దంపతులు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ మారే యోచనలో భాగంగా ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలు నాయిని రాజేందర్ రెడ్డి, బసవరాజు సారయ్య కొండా దంపతులపై ముప్పేట దాడికి దిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ పరిణామాలు వరంగల్ కాంగ్రెస్‌లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి.