హైదరాబాద్ కోఠిలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న జి కిషన్ రెడ్డి

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని కోఠి ప్రాంతంలో జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మహాగణపతికి వీడ్కోలు పలికారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కలిసి గణనాథుని శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు జి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.