మెగా డీఎస్సీపై జగన్‌ది అవగాహన నిల్, అబద్ధాలు ఫుల్: లోకేశ్
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
మెగా డీఎస్సీపై వైకాపా అధినేత జగన్‌కు అవగాహన నిల్, అబద్ధాలు ఫుల్ అని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టెట్‌లో అర్హత సాధించకపోయినా ఉద్యోగాలిచ్చారంటూ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంపై గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.