సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణకు రూ.50.40 కోట్లతో టెండర్లు పూర్తి
రిపోర్టర్: నరేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరు అందించే సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.50.40 కోట్లతో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఆంగ్లేయుల కాలం నాటి ఈ రిజర్వాయర్ ఆనకట్ట బలహీనపడటంతో భారీ వర్షాల సమయంలో ఆందోళన నెలకొంటున్న నేపథ్యంలో, తాజా నిధులతో కట్ట పటిష్ఠత, వెడల్పు, రోడ్లు, కాంక్రీట్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.