పెద్ద మనసు చాటుకున్న వైద్యుడు: ఆడబిడ్డల జననాన్ని వేడుకగా మారుస్తున్న డాక్టర్ గణేష్ రఖ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పూణే

ఆడబిడ్డల రక్షణే తన జీవిత లక్ష్యమని పూణేకు చెందిన వైద్యుడు డాక్టర్ గణేష్ రఖ్ స్పష్టం చేశారు. సమాజంలో లింగ వివక్షను రూపుమాపేందుకు ఆయన ముల్గీ వచ్వా అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన ఆసుపత్రిలో ఆడశిశువు జన్మిస్తే ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఉచిత ప్రసవాలు చేస్తూ, పూలు, కేకులు, మిఠాయిలతో ఘనంగా స్వాగతం పలుకుతున్నట్లు డాక్టర్ గణేష్ రఖ్ వెల్లడించారు.