జన్వాడ ఫామ్‌హౌస్ అక్రమాల బాగోతం బట్టబయలు చేస్తామన్న అద్దంకి దయాకర్
రిపోర్టర్: మహేష్
స్థలం: Telangana
జన్వాడ ఫామ్‌హౌస్ అసలు యజమానులు ఎవరో, దాని వెనుక ఉన్న వీవీఐపీల వివరాలను తెలంగాణ సమాజం ముందుంచుతామని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. సుమారు రూ.300 కోట్ల విలువైన ఈ ఆస్తిని అధికార దుర్వినియోగం చేసి ఏ విధంగా ఆక్రమించుకున్నారో అన్ని వాస్తవాలను త్వరలోనే బయటపెడతామని ఆయన హెచ్చరించారు.